కల్కి ఎఫెక్ట్..బాలీవుడ్ మూవీ వాయిదా!

12
- Advertisement -

నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబోలో వచ్చిన విజువల్ వండర్ కల్కి 2898AD. 27 జూన్ 2024న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ.600 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ వారం పూర్తయ్యే సరికి వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎక్క‌డ చూసినా క‌ల్కి మానియాతో థియేటర్లలో సందడి నెలకొంది.

కల్కి దెబ్బకు ఇప్ప‌ట్లో కొత్త సినిమాలు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లోనూ కల్కి దెబ్బకు సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్‌దేవ‌గ‌న్ న‌టించిన సినిమా “ఔరోన్ మెయిన్ కహాన్ దం తా” జూలై 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు కల్కి జోరు నడుస్తుండటంతో కల్కి సినిమాను వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ఎన్ హెచ్ స్టూడియోజ్ నిర్మించిన ఈ సినిమాకు నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

Also Read:Revanth:ఢిల్లీకి సీఎం రేవంత్!

- Advertisement -