కల్కి..దిశా బర్త్ డే స్పెషల్!

10
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు.

కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపించగా ‘బుజ్జి’తో ప్రభాస్ తన పవర్-ప్యాక్డ్ యాక్షన్, కెమిస్ట్రీతో అదరగొట్టారు. దీపికా పదుకొనే ప్రతి ఫ్రేమ్‌లో ఎమోషన్స్ తో నెరేటివ్ కి డెత్ ని జోడించగా దిశా పటాని తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది.

ఇక ఇవాళ దిశా పటానీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్టన్నింగ్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో దిశా రోక్షిగా కనిపిస్తుండగా తన హాట్ ఫిజిక్ తో ఫ్యాన్స్ కి ఈ సినిమాలో మెస్మరైజ్ చేసింది. ఈ జూన్ 27న గ్రాండ్ గా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

Also Read:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు

- Advertisement -