రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో ‘క‌ల్కి’!

19
- Advertisement -

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ కల్కి 2898 AD. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులని మహా అద్భుతంగా అలరించి, ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

తాజాగా ఈ చిత్రం రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో ఎంట‌ర్ అయిన‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి క‌ర్ణుడి గెట‌ప్‌లో ఉన్న‌ ప్ర‌భాస్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్ చూసి, తెలుగు సినిమా స్థాయిని ప్ర‌శంసిస్తున్నారు. సినిమాలో కీల‌కంగా వున్న బుజ్జి కారు, ఇలా సినిమాలో పాటు చిన్న‌పిల్ల‌ల నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు అల‌రించే అంశాలు ఈ చిత్రంలో వుండ‌టం కూడా మ‌రో కార‌ణం.

Also Read:పెసర మొలకలతో ఆరోగ్యం

- Advertisement -