ఆర్ఆర్ఆర్‌ని బ్రేక్ చేసిన కల్కి!

6
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.భారీ బడ్జెట్‌తో,భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అంచనాలను మించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలి షో నుండే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకోగా ఇక నార్త్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది.

ప్రీమియ‌ర్ షోల‌తో, ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 3.72 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. దీంతో నార్త్ అమెరికాలో అత్య‌ధిక ఓపెనింగ్ అందుకున్న భార‌తీయ చిత్రంగా నిలిచింది. గ‌తంలో ఆర్ఆర్ఆర్ ప్రీమియ‌ర్స్‌, తొలి రోజు క‌లిపి 3.42 మిలియ‌న్లు వ‌సూలు చేసింది.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మించగా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్ తదితరులు కీలకపాత్ర పోషించారు.

Also Read:Gold Rate :లేటెస్ట్ ధరలివే

- Advertisement -