కల్కి బ్రేక్ ఈవెన్‌ ఎంతో తెలుసా?

24
- Advertisement -

భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది కల్కి 2898AD.నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌, ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకొణె, దిశాప‌టానీ కీల‌క పాత్రలు పోషించిన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శక ప్రతిభకు అంతా ఫిదా అవుతున్నారు. రూ.600 కోట్ల బ‌డ్జెట్ తో అశ్వినీదత్ నిర్మించగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాలంటే రూ.395 కోట్ల షేర్ వ‌సూళ్లు సాధించాలి. అంటే దాదాపు రూ.800 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేయాలి.

ఈ సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుంద‌ని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క‌ల్కి మూవీ రూ.1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను దాట‌డం ఖాయ‌మ‌ని అంచనా వేస్తున్నారు.

Also Read:కల్కి..ఓటీటీ అప్‌డేట్!

- Advertisement -