కల్కి @ రూ.555 కోట్లు

20
- Advertisement -

ప్రభాస్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.555 కోట్లు వసూళ్లు రాబట్టింది.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. తొలిరోజు రూ.191.50 కోట్లు వసూల్ చేసిన కల్కి… 4 రోజుల్లోనే రూ.555 కోట్ల మార్క్ టచ్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

ప్ర‌భాస్, దీపికా పదుకోణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన ,విజ‌య్ దేవ‌ర‌కొండ,దుల్కర్ సల్మాన్ ,మృణాల్ ఠాకూర్, మ‌ల‌యాళ న‌టి అన్నా బెన్, హాస్య న‌టుడు బ్రహ్మానందం,ఆర్జీవీ, రాజమౌళి కీలకపాత్ర పోషించారు.

Also Read:కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ!

- Advertisement -