“కలి”..రిలీజ్ డేట్ ఫిక్స్

3
- Advertisement -

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

నటీనటులు – ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.

Also Read:కార్తీ29 ..రిలీజ్ అప్పుడే!

- Advertisement -