కాళేశ్వరం ప్రాజెక్టు… మరో ముందడుగు

193
Kaleshwaram Project becomes cotentious
- Advertisement -

ఉత్తర తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఫోరం హంటింగ్‌ చేస్తున్నారా అంటూ పిటిషనర్‌ను సుప్రీం ప్రశ్నించింది.

సుప్రీం తీర్పుతో విపక్షాలకు చెంపపెట్టులా మారింది. తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌ రావు…కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు సుప్రీం తీర్పును ఫోన్ లైన్లో వివరించారు. వందకు పైగా కేసులు వేసినా రైతులు గెలిచారని తెలిపారు. కోదండరాం,కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకోవాలన్న ఆలోచనను మార్చుకోవాలన్నారు.

రైతులు కష్టాల్లో ఉండాలని కోరుకునే కాంగ్రెస్ నేతలు మన రాష్ట్రంలో ఉండాలని కోరుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను గమనిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు అని దాస్ వివరించారు.

- Advertisement -