మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం అని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం!. తలాపున గోదారి గలగల పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం అని పేర్కొన్నారు.
సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యమని …దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరమంటూ పోస్టు చేశారు.
మా కరువులకు కన్నీళ్ల కు
శాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!తెలంగాణ తెర్లై పోతే సంకలు
గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు
ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన
మా వరప్రదాయిని కాళేశ్వరం!తలాపున గోదారి గలగల పారుతున్న
తనువంతా ఎడారై ఎండిన శాపానికి
విమోచనం కాళేశ్వరం!సముద్ర…
— KTR (@KTRBRS) July 2, 2024
Also Read:Ajith:’విడాముయర్చి’ ఫస్ట్ లుక్