కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్

2
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేశారు అధికారులు. పవన్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేయగా రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్‌, కస్టమ్స్‌ అధికారులతో టీం ఏర్పాటు చేశారు కలెక్టర్‌.

కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్‌ డెన్‌గా మారారని మంత్రి నాదెండ్ల మనోహర్‌..జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బియ్యం దందా కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్ వర్క్ పని చేస్తోందని…అరబిందో కోసం కాకినాడ సీ పోర్టులో 41.12 శాతం వాటాను ఏ విధంగా దక్కించుకున్నారో ప్రజలకు తెలియాలన్నారు. కె.వి.రావు కుటుంబాన్ని బెదిరించి వాటా రాయించుకున్నారు…జి.ఎం.ఆర్. నుంచి కాకినాడ ఎస్.ఈ.జడ్ లాక్కున్నారు అని మండిపడ్డారు.

బియ్యం స్మగ్లింగ్ కోసం దేశ భద్రతనూ రిస్క్ లో పెట్టారు అని వైసీపీ నేతలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Also Read:KTR: శ్రీకాంతాచారి అమరత్వం గొప్పది

- Advertisement -