మగాడైతేనే ఓకే !

219
Kajol wants more manly and less boyish Hero
Kajol wants more manly and less boyish Hero
- Advertisement -

పెద్ద వయసున్న హీరోయిన్లు, కుర్ర హీరోలతో రోమాన్స్ చేయడం బాలీవుడ్‌లో కొత్తేం కాదు. ‘ఏక్ మైన్‌ ఔర్ ఎక్కా తూ’ సినిమాలో తన కంటే చిన్నవాడైనా ఇమ్రాన్‌ ఖాన్‌తో… అలాగే ‘కి అండ్‌ కా’లో అర్జున్‌ కపూర్‌తో రోమాన్స్ చేసింది కరీనా కపూర్. ఐశ్వర్య రాయ్‌ కూడా గతేడాది వచ్చిన ‘ఏ దిల్ ముష్కిల్‌ హై’ సినిమాలో రణబీర్ కపూర్‌తో రోమాన్స్‌ పండించింది. పెళ్లై పిల్లలున్న ఈ టాప్ బాలీవుడ్ హీరోయిన్లు కుర్ర హీరోలతో రోమాన్స్ చేయడానికి వెనకాడడంలేదు.

Kajol Ajay devgn

90వ దశకాన్ని ఒక ఊపు ఊపి.. బాలీవుడ్‌ రారాణిగా వెలుగొందిన కాజోల్‌.. సహజమైన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల వీఐపీ2 సినిమాతో సౌత్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇంకా తనలో వన్నె తగ్గలేదని నిరూపించింది. తాజాగా ఇదే ప్రశ్న కాజోల్ దేవగణ్‌ కూడా ఎదురైంది. ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఈ అమ్మడు హాట్ సీన్స్ లో నటించడానికి ఎటువంటి అభిప్రాయం లేదని స్పష్టం చేసింది. ఆ పాత్రకు అవసరం అనుకుంటే, స్క్రిప్ట్‌ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానని చెప్పింది.

Kajol

ఈ రోజుల్లో దర్శకులు కొత్త సబ్జెక్టులు డీల్ చేస్తున్నారని, కొత్తగా ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయితే కుర్ర హీరోతో రోమాన్స్ చేయాలంటే ఒక కండీషన్ పెట్టింది కాజోల్. అదేంటంటే కుర్ర హీరోలలో ఎవరితోనైనా సరే… కానీ మగతనం ఉన్న హీరోలతో రొమాన్స్ చేయడం ఇష్టమని బోల్డ్‌గా చేప్పేసింది కాజల్ నిర్మొహమాటంగా చెప్పడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఆ కుర్ర హీరో పేరు చెప్పమంటే మాత్రం సమాధానం దాటవేసింది కాజోల్.

- Advertisement -