రొమాన్స్ కు సై అంటోన్న కాజోల్!

233
Kajol Ready to Romance with young Heroes
- Advertisement -

సాధారణంగా హీరోయిన్స్ కి మూడు పదుల వయసొచ్చాకా ఎటువంటి పాత్రలు చేస్తారో తెల్సిన విషయమే. ప్రస్తుత రోజుల్లో కొందరు మాజీ బాలీవుడ్ హీరోయిన్స్ నాలుగు పదుల వయసొచ్చినా ఇంకా కుర్ర హీరోలతో రొమాన్స్ కి రెడీ అవుతున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఘాటు ముద్దులకు కూడా అడ్డు చెప్పడం లేదు. అదే విధంగా వారి అందాల్ని కూడా ఇంకా ఇరవై వయసన్నట్టుగానే మెయింటెన్ చేస్తూ..స్కిన్ షోకి కూడా ఒకే అనేస్తున్నారు.  అప్పట్లో అయితే మాజీ హీరోయిన్స్ కేవలం .. అక్క, తల్లి, అత్తా పాత్రలతోనే రాణించే వారు కానీ నేటి మాజీ హీరోయిన్స్ మాత్రం అటు హీరోలతో రెండోసారి రొమాన్స్ చేయడానికి కూడా వెనకాడడం లేదు.

Kajol Ready to Romance with young Heroes

ముఖ్యంగా కుర్ర హీరోలతో ఘాటు రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సైతం ఆసక్తి చూపిస్తుండడం విశేషం. ఇందుకు నిదర్శనం .. కరీనా కపూర్, ఐశ్వర్య రాయ్ లాంటి మాజీ భామలు కుర్ర హీరోయిన్స్ తో రెచ్చిపోయారు .. ఇప్పుడు అటు గ్లామర్ పాత్రలకు, ఇటు రొమాన్సుకు కూడా రెడీ అయింది అందాల భామ కాజోల్. సరైన స్క్రిప్ట్ వస్తే ఇలాంటివాటికి రెడీ అని చెబుతుంది.

Kajol Ready to Romance with young Heroes

చాలా గ్యాప్ తరువాత ధనుష్ నటించిన విఐపి 2లో నటించిన కాజోల్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ .. సరైన స్క్రిప్ట్ ఉంటె రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు రెడీ అని చెప్పింది. అయితే ఆ పాత్రకు అవసరం అయితేనే చేస్తానని .. అలాగే కుర్ర హీరోలకన్నా మగతనం ఉన్న హీరోలైతే రొమాన్స్ చేయడం ఇష్టమని చెప్పింది. మరి ఏ యంగ్ హీరోతో ఈ సీనియర్ నటి రొమాన్స్ చేస్తుందో.. చూడాలి!

- Advertisement -