మేకప్‌ లేకుండా కాజల్‌ని చూస్తే..షాకే..!

424
kajal real pic

కాజల్ వయసు పెరిగినా తరగని అందం ఆమె సొంతం. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ అడపదడప సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సినిమా అనే రంగుల ప్రపంచంలో హీరోయిన్లకు అందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్లామర్‌గా ఉంటేనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు.

తెరపై తమ అభిమాన హీరోయిన్‌ అందాలను చూస్తు మురిసిపోతారు. అలాంటి ముద్దుగుమ్మలు ముఖానికి మేకప్‌ లేకుండా కెమెరా ముందుకు రావడం కష్టమే. అలాంటిది తన అందం, అభినయంతో అగ్ర కథానాయికగా రాణిస్తున్న చందమామ కాజల్‌ సహజంగా దిగిన ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

అందం అంటే మనల్ని మనం స్వీకరించుకోవడమని కాజల్‌ ఈ ఫొటోలకు క్యాప్షన్‌ పెట్టింది. మేకప్‌ లేని ఫొటో షేర్ చేయడానికి ధైర్యం కావాలని, మన శారీరక ఆకర్షణకు క్రేజ్‌ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామని చెప్పుకొచ్చింది. అందం కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని పేర్కొంది. మేకప్‌ మనల్ని బాహ్యంగా అందంగా తయారు చేస్తుంది. అంతేకానీ మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా?మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉందని పేర్కొంది. ప్రస్తుతం కాజల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాజల్ ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సీతపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

kajal aggarwal