- Advertisement -
అందాల చందమామ కాజల్ అగర్వాల్ దక్షిణాది దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి.. నెం.1 హీరోయిన్‌గా ఎదిగింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క ఓటీటీలపై కూడా దృష్టి పెట్టింది ఈ పంచదార బొమ్మా. ఆ మధ్య హాట్‌స్టార్‌లో వచ్చిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే సినిమాతో మంచి హిట్‌ని అందుకుంది కాజల్. ఇక కాజల్‌కి సౌత్ ఇండస్ట్రీల్లో ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.
తన అందం అభినయంతో అకట్టుకునే ఈముద్దుగుమ్మ ఇటీవల ఇంగ్లిష్ టీచర్ కొత్త అవతారం ఎత్తింది. అయితే, సినిమాలో కాదు.. నిజజీవితంలోనే. ఈ విషయం గురించి ఈ ముద్దుగుమ్మ చెబుతూ, ‘ఈ సెకండ్ వేవ్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఏమీ తోచక వివిధ అంశాలలో నాలెడ్జ్ పెంచుకున్నాను. అలాగే, మా పనిమనిషి అబ్బాయికి ఇంగ్లిష్ పాఠాలు కూడా చెప్పాను” అని చెప్పింది.
- Advertisement -