ఆ దర్శకుడితో పని చేయను

195
kajal
- Advertisement -

కాజల్ అగర్వాల్ అందం, అభినయం, అల్లరి కలగలిపిన అమ్మాయి. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తున్న కాజల్ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్.. చేస్తున్న సినిమాలోని యూనిట్ మొత్తం ని ఫ్రెండ్స్ గా చేసుకొని సందడి చేసే కాజల్ తాను చేసిన దర్శకులతో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలని అనుకొంటున్నట్లు చాలా సార్లు ప్రకటించింది. కానీ ఒక్క దర్శకుడితో మాత్రం ఇక జన్మ లో సినిమా చేయనని చెప్పింది.. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..!!  ఆమెని అంధురాలి పాత్రలో చూపించిన దీపక్‌ తిజోరి.

kajal_agarwal

ఆయన దర్శకత్వంలో గత ఏడాది ‘దో లఫ్జోం కీ కహానీ’ సినిమాలో నటించింది కాజల్‌. అందులో అంధురాలిగా జెన్నీ పాత్ర పోషించడం కోసం చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేసింది. ముంబైలోని బ్లైండ్‌ స్కూల్స్‌కి తిరిగి అంధులను నిశితంగా గమనించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంది. ఇదంతా కూడా కాజల్‌కి కష్టం అనిపించలేదట. కానీ దీపక్‌ తిజోరి డైరెక్షన్‌లో పని చేయడం మాత్రం కష్టమని అంది. మరోసారి అతని దర్శకత్వంలో అవకాశం వచ్చినా ఆ సినిమా చెయ్యనని నిర్మొహమాటంగా చెప్పేసింది కాజల్‌.

- Advertisement -