శ్రీరెడ్డి ఆరోపణలలో నిజం లేదు-కాజల్

212
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళ పరిశ్రమను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. సమంత, కాజల్, రకుల్ లాంటి అగ్రకథానాయకులు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాళ్లుగనకా అసలు నిజాలు చెబితే కొందరి గుండెలు ఆగిపోతాయి అంటూ ఫేస్ బుక్ లో ఇటీవలె పోస్టు పెట్టింది.

Sri-Reddy-Leak

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్, శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించారు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని చెప్పారు. చిత్ర పరిశ్రమలో నేను ఇప్పటి వరకు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదని, అందుకు నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నా అని తెలిపారు. చిత్ర పరిశ్రమలలో క్యాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తనకు తెలియదన్నారు. ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పేముందు.. ఆడపిల్లలతో అబ్బాయిలు ఎలా వ్యవహరించాలో తల్లిదండ్రులు నేర్పించాలని అన్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజతో ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజతో వీర, సారొచ్చారు వంటి చిత్రాలలో నటించారు. ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. మరి మూడో సినిమాతోనైనా ఈ జంటకు కలిసొస్తుందో లేదో చూడాలి. ఇక తమిళంలో ‘క్వీన్’ రిమేక్ గా తెరకెక్కుతున్న ‘పారిస్ పారిస్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

- Advertisement -