లవ్‌ ఎఫైర్‌పై కాజల్ క్లారిటీ…!

203
Kajal on Love Affair
- Advertisement -

వరుస ఫ్లాప్‌లతో విలవిలలాడిన కాజల్‌.. ఖైదీ నంబర్‌ 150 సినిమాలో చిరంజీవితో చిందులేసి తన సక్సెస్‌ ఖాతాని మళ్ళీ తెరిచింది. అదిరిపోయే సినిమాలల్లో ఆఫర్లు దక్కించుకొని తండ్రీ కొడుకులతో సూపర్ విజయాలని అందుకున్నఘనత ఈ ముద్దుగుమ్మకే దక్కింది.  ఇక  ఖైదీ నంబర్‌ 150 సినిమాతో ఈ అమ్మడుకి ఆఫర్ల వరద వచ్చిపడుతోంది.

ఈ నేపథ్యంలో తనపై కుట్ర జరుగుతోందని కాజల్ తెలిపింది. నాపై కుట్రలు పన్నుతున్నారు. అయితే, అవినన్నేమీ చేయలేవు. నా స్థాయిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేస్తోంది. ఆ మధ్య ఒక భేటీలో తాను ప్రేమ వివాహమే చేసుకుంటాననీ ఈ నటి చెప్పింది. అంతేకాక తనకు కాబోయే వరుడు సినిమా రంగానికి చెందిన వాడైనా లేదా మరే ఇతర రంగాలకు చెందిన వాడైనా పర్వాలేదనీ తెలిపింది.

 Kajal Agarwal's Love Affair with Businessman

దీంతో కాజల్‌పై  రకరకాల పుకార్లు షికార్ చేస్తున్నాయి. కాజల్ ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడితో తరచూ రహస్యంగా కలుసుకుంటున్నారనీ టాక్. అదే విధంగా ఇటీవల అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది.  దీంతో కాజల్ తీవ్ర మనస్దాపానికి గురైందట. తన ఎదుగుదలను ఓర్వలేని వారే ఇలాంటి దుష్పచారాన్ని చేస్తున్నారు. ఇదంతా వారు తనపై పన్నుతున్న కుట్ర అని నటి ఆరోపించారు.

ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్, అజిత్, వంటి ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తున్న ఏకైక హీరోయిన్ కాజల్ అగర్వాల్‌నే. అదే విధంగా తెలుగుతో పాటు హిందీలోనూ అవకాశాలను అందుకుంటున్న నటి కాజల్. తెలుగులో రానాతో రొమాన్స్ చేసిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. హిందీలో సన్నిడియోల్‌తో నటించే లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించిందనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -