కాజల్ అగర్వాల్ మళ్లీ తన టాప్ హీరోయిన్ స్థాయిని ఒడిసిపట్టేసిందని ఇప్పటికే చెప్పేసుకున్నాం. సమంత స్లో అవడం.. శృతిహాసన్ కి ఫోకస్ తగ్గడం వంటి అంశాలు అమ్మడికి బాగానే కలిసొచ్చాయి. ఇదే సమయంలో టాలీవుడ్ చందమామ జాగ్రత్తగా వేస్తున్న అడుగులు కూడా.. ప్లస్ పాయింట్స్ గా మారుతున్నాయి.
వరుస ఫ్లాప్స్ తో బాగా ఇబ్బంది పడుతున్న సమయంలో.. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పక్కన ఐటెం సాంగ్ లో నటించింది కాజల్ అగర్వాల్. పక్కా లోకల్ అంటూ చందమామ వేసిన చిందులు సినిమాకు మాత్రమే కాదు.. కాజల్ కెరీర్ కు ప్లస్ అయ్యాయి. అయితే.. ఆ పాటను కేవలం ఎన్టీఆర్ కు తనకు ఉన్న ఫ్రెండ్షిప్ ను బేస్ చేసుకునే చేశానని గతంలోనే తేల్చి చెప్పేసింది కాజల్. వరుసగా ఐటెం సాంగ్స్ చేసే ఉద్దేశ్యం లేదని కూడా చెప్పింది. ఇప్పుడు కోలీవుడ్ టాప్ స్టార్స్ తో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది కూడా. ఇలాంటి సమయంలో కాజల్ మరో ఐటెం పాట చేస్తుందని ఊహించడం కష్టమే. కానీ అదే వాస్తవమనే టాక్ వినిపిస్తోంది. యంగ్ టైగర్ లేటెస్ట్ మూవీ జై లవ కుశలో కూడా కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ చేయనుందట.
కేవలం 4-5 రోజుల షెడ్యూల్స్ మాత్రమే అడగడం.. 40 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం.. పైగా అలా అడిగిన వ్యక్తి ఎన్టీఆర్ కావడంతో.. మరో ఐటెం సాంగ్ కు కాజల్ సై అన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 21న విడుదల కానున్న జై లవ కుశ కోసం.. చివరగా ఈ పాటనే భారీ సెట్ లో చిత్రీకరించనున్నారట. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత మరోసారి ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్ లో రూపొందనున్న ఐటెం సాంగ్.. జై లవకుశకు అడ్వాంటేజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ అమ్మడు తెలుగులో `నేనే రాజు నేనే మంత్రి`, తమిళ్‌లో `వివేగం` సినిమాల విజయాలు కాజల్ ఖాతాలో పడ్డాయి. ఇక క్వీన్ రీమేక్‌లో కూడా ప్రధాన పాత్ర పోషించనుంది.ఈ మూవీ ద్వారా మరో విజయం సొంతం చేసుకునే అవకాశాలున్నాయని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. `క్వీన్` చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.