వయసు పెరిగినా తరగని అందం కాజల్ సొంతం. దశాబ్దకాలంగా తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాతో పాటు కమల్ హాసన్ భారతీయుడు 2, శర్వానంద్ సినిమాల్లో నటిస్తోంది.
అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యూవెలరీ బిజినెస్‌తో పాటు షూ కంపెనీ రన్ చేస్తున్న కాజల్ రీసెంట్గా నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించింది.
కేఏ(KA)వెంచర్ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. నానితో అ! సినిమా చేసిన ప్రశాంత్ వర్మతో నిర్మాతగా తొలి సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కానీ టీ టౌన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాణ రంగం నుంచి తప్పుకుందట కాజల్. ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది.