బాలీవుడ్ హోమ్లీ బ్యూటీ కాజోల్ కి 48 సంవత్సరాలు. 30 ఏళ్లుగా నటిస్తోంది. ఏ సినిమాలో కూడా కనీసం హద్దులు దాటి వెళ్ళలేదు. అలాగే ఘాటు ముద్దు సీన్లలో కూడా కాజోల్ కనిపించలేదు. చాలా సందర్భాల్లో అవి చెయ్యను అని కాజోల్ ఖరాకండీగా చెపుతూ వచ్చింది. అలాంటి భామ సడెన్ గా లేటు వయసులో.. అది కూడా 48 ఏళ్ల ఏజ్ లో ఏకంగా ఘాటు సీన్లు చెయ్యడం అందరికీ షాక్ కి గురి చేసింది.
కాజోల్ నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ సిరీస్ లో హాట్ సీన్స్ నటించింది. ఈ సిరీస్ నిండా కాజోల్ ఘాటు ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. నిజానికి కాజోల్ తో గతంలోనూ రకరకాల బెడ్ రూమ్ భంగిమలు, దృశ్యాలు చిత్రీకరించారు. కాకపోతే, అప్పుడు కాజోల్ ఒక పరిధి పెట్టుకుంది. కానీ, ఈ సిరీస్ లో ఆ పరిధి దాటింది అని నడుస్తోంది. అసలు కాజోల్ ఎందుకు ఆ రకమైన సీన్స్ ఒప్పుకుంది ? అని నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా కాజోల్ నిర్ణయం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read: యూట్యూబ్ లో ఆదిపురుష్ లీక్
కాజోల్ బోల్డ్ గా నటించడంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు కాజోల్ డేరింగ్ ని మెచ్చుకుంటున్నారు. చాలా మంది మాత్రం మరింత ‘డెస్పెరేట్’గా చెయ్యడం ఏంటి అని పెదవి విరుస్తున్నారు. మొత్తానికి కాజోల్ దెబ్బకు ‘లస్ట్ స్టోరీస్ 2’ పై అంచనాలు పెరిగాయి. మొత్తమ్మీద నెట్ ఫ్లిక్స్ కి ఈ సిరీస్ ద్వారా బాగానే గిట్టుబాటు అయ్యేలా ఉంది.
Also Read: దేవాస్ మీడియాలో శ్రవణ్‌రెడ్డి