కలువ కళ్ళ సుందరి కాజల్ కి ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లు లభించలేదు. టాలీవుడ్ టాప్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలలో నటించిన ఒక్క సక్సెస్ రాలేదు. అటు హిందీ మూవీపై ఆశలు పెట్టుకోగా అది బెడిసి కొట్టింది. దీంతో అందరు కాజల్ పని అయిపోయింది అనుకున్నారు. కాని ఈ అమ్మడికి మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్మాత్మక చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దక్కడంతో మరో సారి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే.. ఇప్పటివరకూ మెగాస్టార్ ఖైదీ 150కి సంబంధించిన ఫోటోలు, మెగాస్టార్ ఫస్ట్ లుక్ ఫోటోలు బైటకొచ్చాయి. ఇక కాజల్ లుక్‌కి సంబంధించిన ఫోటోలు కనిపించలేదు. చిరంజీవి-కాజల్ జంటగా ఎలా ఉండనున్నారు? వారి పెయిర్ స్క్రీన్ పై ఎలా కనిపించనుంది? లాంటి ప్రశ్నలు.. మెగా అభిమానుల్లో నెలకొన్నాయి.
ఇప్పుడు వాటన్నిటికీ ఓ చెక్ పెట్టేస్తూ.. ఓ స్పెషల్ ఫోటోను పోస్ట్ చేసింది ఖైదీ టీం. చిరంజీవి పక్కన కాజల్ ఫోటో ఒకటి ఖైది యూనిట్ బయటపెట్టింది. కొత్త హెయిర్ స్టైల్ తో.. యంగ్ గా మారిపోయిన చిరంజీవి.. ఆయన పెదాలపై నవ్వు.. ఫ్యాన్స్ కి బోలెండంత సంతోషం పంచేస్తున్నాయి. పక్కనే ఉన్న కాజల్ ఎంత అందంగా కనిపిస్తోందో చెప్పేందుకు మాటలు కూడా కష్టమే.
ఈ ఫోటో షేర్ చేసేందుకు కాజల్ ఎంతగా ఉత్సాహం చూపిందంటే.. ఖైదీ యూనిట్ కంటే ఐదు నిమిషాల ముందే ట్విట్టర్ లో పెట్టేయడం విశేషం. ఇక క్రొయేషియాలో జరుగుతున్న షూటింగ్ స్పాట్ లో తన టీమ్ తో కలిసి ఎంజాయ్ చేసింది కాజల్. అందుకు సంబంధించిన ఫొటోల్ని ట్విట్టర్ లోనూ పోస్ట్ చేసింది.