అసభ్యంగా చేశానని ఓపెన్‌గా చెప్పేసింది..

357
- Advertisement -

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరొయిన్లు ఆవకాశాల కోసం తెగ కష్టపడతారు.  అంతేకాదు వచ్చిన ఏ ఒక్క ఆఫర్ ని కూడా వదలకుండా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే అలా ఆఫర్లు రావాలంటే.. కొన్ని కొన్ని తప్పులు చేయాల్సిందే… అనే భావన అందర్లోనూ ఉంది. అయితే కాజల్‌ అగర్వాల్‌ కూడా  ఆఫర్లకోసం  ఆ తప్పు చేసిందట.  ఇప్పుడేమో ఆ తప్పు ఎందుకు చేశానా అంటు తెగ బాధపడిపోతుందట కాజల్‌.
 Kajal Aggarwal takes a different route in Bollywood
ఎందుకంటే..ఏ హీరోయినైనా కెరియర్ మొదట్లో ఎలాంటి ఆఫర్స్ వచ్చిన ఏం ఆలోచించకుండా ఒప్పుకుంటారు..ఆ తర్వాత కాస్త పాపులర్ అయ్యాక అయ్యో..అప్పట్లో ఆలా ఎందుకు చేశానా అని ఫీల్ అవుతారు..ఇప్పుడు అలాగే ఫీల్ అవుతుందట చందమామ ఫేమ్ కాజల్. ఖైదీ నెం 150 తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ కెరియర్ ను స్పీడ్ చేసిన కాజల్ , అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడుతుంది..
 Kajal Aggarwal takes a different route in Bollywood
కొత్తగా అవకాశాల కోసం వచ్చిన భామలను ఇండస్ట్రీలోని వ్యక్తులు వేధించడం మాటేమిటో కానీ, తన వరకూ అయితే.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవగాహనలేక అసభ్యంగా కనిపించే కొన్ని సీన్లలో చేసి తప్పు చేశానని కాజల్ చెబుతోంది. కొత్తగా అవకాశాలను సంపాదించుకోవాలని అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొని ఫీల్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు లో రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ లో నటిస్తుంది. ఇక తమిళం లో కూడా విజయ్ , అజిత్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.

- Advertisement -