గ్లామర్‌ సీక్రెట్‌ బయటపెట్టిన కాజల్…

399
kajal
- Advertisement -

వయసు పెరిగినా తరగని అందం కాజల్ సొంతం. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ అడపదడప సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సినిమా అనే రంగుల ప్రపంచంలో హీరోయిన్లకు అందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్లామర్‌గా ఉంటేనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. దశాబ్దకాలంగా తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్‌ తన గ్లామర్ సీక్రెట్ భయటపెట్టింది.

తన చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి ఒక న్యూట్రిషనల్ ప్రొడక్ట్ కారణమని తెలిపారు కాజల్. ఐదేళ్ల క్రితం, నా ఫ్రెండ్ ఒకరు నన్నొక మాట అడిగారు. ఆరోగ్యవంతమైన చర్మం కోసం న్యూట్రిషన్ ప్రొడక్ట్‌ను ట్రై చేయాలని నేను అనుకుంటే గనుక, ఆయన స్టార్టప్ దీనిపైనే పనిచేస్తుందని, దాన్ని వాడి ఎలా ఉందో చెప్పాలని కోరారు. అప్పటి నుంచి నా దినచర్యలో ఇది స్థిరంగా ఉండిపోయిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

న్యూట్రోవా సాధించిన క్లినికల్ స్టడీ ఫలితాలకు అభినందనలు. 2014 నుంచి నా చర్మ సౌందర్యాన్ని ఇది మాత్రమే కాపాడింది. మీరూ కొనండి అని కాజల్ పేర్కొంది.

 

- Advertisement -