పీకల్లోతు ప్రేమలో కాజల్‌…!

303
Kajal Agarwal's Love Affair with Businessman
- Advertisement -

గత ఏడాది విజయాలు లేక విలవిలలాడిన కాజల్‌..ఈ  ఏడాది ఖైదీ నంబర్‌ 150 సినిమాలో చిరంజీవితో చిందులేసి తన సక్సెస్‌ ఖాతాని మళ్ళీ తెరిచింది. అదిరిపోయే సినిమాలల్లో ఆఫర్లు దక్కించుకొని తండ్రీ కొడుకులతో సూపర్ విజయాలని అందుకున్నఘనత ఈ ముద్దుగుమ్మకే దక్కింది.  ఇక  ఖైదీ నంబర్‌ 150 సినిమాతో ఈ అమ్మడుకి ఆఫర్ల వరద వచ్చిపడుతోంది.

ఇక కాజల్‌ రీల్ జీవితాన్ని కాసేపు పక్కన పెడితే..రియల్ జీవితంలో మాత్రం కలర్‌ఫుల్ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మడు ప్రేమలో పడిందట.  తమిళ, తెలుగు చిత్ర రంగాల్లో బిజీగా వున్న కాజల్‌ ఇంతకాలం పెళ్లి ఊసెత్తలేదు. చెల్లెలు ఎప్పుడో పెళ్లి చేసుకున్నప్పటికీ, తనని మాత్రం  పెళ్లి ఊసు అడగొద్దని మీడియాతో ఖచ్చితంగా చెప్పేసిన ఈ భామ ఇప్పుడు ప్రేమలో తేలిపోతుందట. తన ఇన్నేళ్ల కెరియర్‌లో కాజల్‌ ఏ హీరోతోను అఫైర్‌ పెట్టుకోలేదు. రిలేషన్స్‌ పరంగా క్లీన్‌ చిట్‌ మెయింటైన్‌ చేసిన కాజల్‌ ఫైనల్‌గా తన వాడిని సెలక్ట్‌ చేసుకుందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

 Kajal Agarwal's Love Affair with Businessman

అయితే మొత్తాని ఈ పంచదార బొమ్మ  చాలా మంది హీరోయిన్లలానే ఒక బిజినెస్‌మాన్‌తో లవ్‌లో పడిందట. దేశ వ్యాప్తంగా హోటల్స్‌ వున్న ఒక ప్రముఖ హోటలియర్‌తో కాజల్‌ ప్రేమలో పడిందని, ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారని వినిపిస్తోంది. అయితే ప్రేమలో పడ్డ సంగతి కానీ, పెళ్లి ఆలోచన చేస్తున్నట్టు కానీ కాజల్‌ ఇంకా చెప్పలేదు.  కానీ కాజల్‌ పెళ్లి చేసుకుంటోందంటే మాత్రం ఆమెని పిచ్చిగా అభిమానించే లక్షలాది అభిమానుల గుండెల్లో బాంబు పడ్డట్టే మరి.

- Advertisement -