రాహుల్ గాంధీతో కాజల్ డేటింగ్..!

335
online news portal
- Advertisement -

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడా?.అంటే మీడియా వర్గాల్లో ఇదే టాపిక్ విపరీతమైన చర్చలకు దారితీస్తోంది.పెళ్ళి విషయంలో ఇంతవరకూ నోరు మెదపని రాహుల్ ఇన్నాళ్లకు తన మనస్సును మార్చుకున్నాడని సమాచారం. పెళ్లి చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశాడట. దీంతో ఈ 46 ఏళ్ల సొట్టబుగ్గల అందగాడికి కాబోయే వధువు కోసం వెతుకుతున్నారట.అంతే కాదు ఇటీవల రాహుల్ తల్లి సోనియా గాంధీ ఓ సంబంధం చూసినట్టుగా.. ఎన్నికల తర్వాత పెళ్లి జరుగుతున్నట్లుగా రూమర్లు కూడా వచ్చాయి.

కానీ, ఈ ముదురు బ్రహ్మచారి, టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ తో డేటింగ్ లో ఉన్నట్లు తాజాగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఓ ప్రైవేటు పార్టీ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమకు దారితీసినట్లు చెబుతున్నారు.అందుకోసమే కాజల్ టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కి మకాం మార్చిందని సినీవర్గాలు అంటున్నాయి. అందుకే ఈ మధ్య ఎక్కడ చూసినా కాజల్ పెళ్లి ప్రస్తావన తెస్తుందట. అయితే ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో అవి పూర్తయ్యాక అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జోరుగా సాగుతుంది.

- Advertisement -