జోష్‌ పెంచిన కాజల్‌…!

435
- Advertisement -

టాలీవుడ్‌లో చందమామ సినిమాతో పరిచయమై…. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. మగధీర, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ,టెంపర్‌ లాంటి సినిమాలు మంచి హిట్‌ కాగా….. ఈ ఏడాది విడుదలైన బ్రహ్మోత్సవం, సర్ధార్‌గబ్బర్‌సింగ్‌ సినిమాలు అట్టర్‌ ప్లాప్‌గా నిలిచాయి. దీంతో తెలుగులో కాజల్‌ పని అయిపోనట్టే అని అంతా అనుకున్నారట. దీనికి తోడు ఈ బ్యూటీ జనతా గ్యారేజ్‌లో ఐటెంసాంగ్‌లో ఆడిపాడటంతో ఇక టాలీవుడ్‌లో కాజల్‌ కెరీర్‌ ముగిసిపోయిందంటూ వార్తలు వచ్చాయి.

kajal agarwal

వాటన్నింటికి పుల్‌స్టాప్‌పెడుతూ మళ్లీ పుల్‌ బిజీ అయిపోయిందట కాజల్‌. ప్రస్తుతం తెలుగు తమిళంలో కలిపి ఈ బ్యూటీ ఏకంగా ఆరుసినిమాలు చేస్తుందట. కాజల్ ఒకేసారి ఆరు సినిమాల్లో నటిస్తుండడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. అవకాశాలు లేక ఐటెం బ్యూటీగా టర్న్‌ తీసుకుందామనుకున్న కాజల్‌…. బడా సినిమాలను లైన్‌లో పెట్టి తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది.

kajal agarwal

ప్రస్తుతం ఖైదీనెంబర్‌ 150 సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వీటితో పాటు తమిళంలో నాలుగు పెద్దసినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. తమిళంలో జీవాతో నటించిన కవాలై వేండెం సినిమాను తెలుగులో ఎంత వరకు ఈ ప్రేమ టైటిల్‌తో రిలీజ్‌కి సిద్దంగా ఉంది. అదేవిధంగా తలా 57మూవీలో అజిత్‌కి జోడిగా నటిస్తుంది. ఇక మరోసారి ధనుష్‌తో నటించేందుకు సంతకం చేసిందట కాజల్‌. ధనుష్‌ భార్య సౌందర్య దర్శకత్వం వహించనున్న ఈ కొత్త సినిమాలో కాజల్‌ని హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు. ఇంకా కాజల్‌కు సినిమాలు ఉండవు అనుకున్న తరుణంలో ఈ బ్యూటీకి ఇలా వరుసగా సినిమాలు రావడంతో పుల్‌ ఖుషీగా ఉందట.

kajal agarwal

- Advertisement -