ఆమె షారుఖ్ ప్రేయసి, వదిలేయండి

34
- Advertisement -

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ – బాలీవుడ్ స్టార్ హీరో ‘షారుఖ్ ఖాన్’ పై ఎన్నో రూమర్స్ వినిపించాయి. వీరి మధ్య ఒకప్పుడు ఎఫైర్ కూడా నడిచింది అని టాక్ నడిచింది. కానీ, ఆ తర్వాత వీరి మధ్య ఏం జరిగిందో గానీ, ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కాజోల్ లైఫ్ లోకి అజయ్ దేవగన్ వచ్చాడు. కట్ చేస్తే.. పాతికేళ్ళు గడిచిపోయాయి. ఇక షారుఖ్ ఖాన్ గత సినిమా ‘పఠాన్’ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది. దాదాపు వెయ్యి కోట్లకు పైగా పఠాన్ సినిమా వసూళ్లు నమోదు చేసిందని టాక్.

అయితే, పఠాన్ కలెక్షన్స్ పై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాజోల్ తాజాగా నటించిన ‘ది ట్రయల్’ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ ‘ది ట్రయల్’ ప్రమోషన్ లో భాగంగా కాజోల్ ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది. ఇంతకీ, కాజోల్ ఏం మాట్లాడింది అంటే.. మళ్లీ షారుఖ్ తో తనకు సినిమా చేయాలని ఉంది అని, అలాగే ఆ సినిమాలో తమ ఇద్దరి మధ్య ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉండాలని తాను కోరుకున్నట్లు కాజోల్ చెప్పుకొచ్చింది.

Also Read:రేవంత్ కు పొంగులేటి ఎఫెక్ట్ ?

అయితే, యాంకర్ షారుఖ్ ను మీరు ఇప్పుడు కలిస్తే ఆయనను మీరు ఏం ప్రశ్న అడుగుతారు ? అని అడగగా.. వెంటనే కాజోల్ స్పందిస్తూ… పఠాన్ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంతో చెప్పమంటాను అంది. దీంతో పఠాన్ సినిమా కలెక్షన్స్ విషయంలో కాజోల్ నమ్మడం లేదు అంటూ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆమె పై మండి పడుతున్నారు. కానీ, కొందరు నెటిజన్లు మాత్రం కాజోల్ – షారుఖ్ మధ్య ఉన్న పాత సాహిత్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆమె షారుఖ్ ప్రేయసి, వదిలేయండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:షాక్ ఇచ్చిన ఇలియానా..ఇతనెవ్వరు?

- Advertisement -