కాజోల్ లస్ట్ కామెంట్స్ వెనుక కథ అదే

35
- Advertisement -

కాజోల్, తమన్నా, మృణాల్ ఠాకూర్, విజయ్ వర్మ తదితరలు నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్‌ సందర్భంగా కాజోల్‌ను లస్ట్ అంటే ఏమిటని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. లస్ట్ అంటే విపరీతమైన కోరిక అని.. అది శారీరక వాంఛ మాత్రమే కాదని, ఏదైనా కావొచ్చని చెప్పుకొచ్చింది. తన వరకైతే ఇష్టమైన ఆహారాన్ని తినడం, పిల్లలతో గడపడం, డ్యాన్స్, మ్యూజిక్.. ఇవన్నీ లస్ట్‌తో సమానమని కాజోల్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

కాజోల్ ఇలా కామెంట్స్ చేయడానికి ముఖ్య కారణం ఆమె లస్ట్ స్టోరీస్ 2 లో చాలా బోల్డ్ గా నటించింది అని, తన కంటే వయసులో చిన్న వ్యక్తితో ఆమె ఎఫైర్ పెట్టుకుంటుందని.. అది కూడా తన ఫ్యామిలీ మెంబర్ తో అని, అందుకే కాజోల్ లస్ట్ పై ఈ విధంగా కామెంట్స్ చేసింది అని టాక్. కానీ 48 ఏళ్ల ఏజ్ లో కాజోల్ ఏకంగా ఘాటు సీన్లు చెయ్యడమే బాగాలేదు అని ఆమె ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఏది అయితే ఏం లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ నిండా కాజోల్ ఘాటు ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి. నిజానికి కాజోల్ గతంలోనూ రకరకాల బెడ్ రూమ్ భంగిమలు, హాట్ అండ్ కిస్ సీన్స్ చేసింది. అప్పుడు ఆమె హీరోయిన్. ఆ సీన్స్ చేసినా పెద్దగా వ్యతిరేకత రాలేదు.

Also Read:‘నారాయణ అండ్ కో’ కంటెంట్ చాలా బాగుంది..

కానీ, ఇప్పుడు కాజోల్ వయసు యాభై కి దగ్గర్లో ఉంది. పైగా కాజోల్ భర్త అజయ్ దేవగణ్ పెద్ద హీరో. అయినా, కాజోల్ ఇలా లస్ట్ స్టోరీస్ 2 లో పరిధి దాటి నటించడం బాగాలేదు. ఇక ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా తమన్నా బోల్డ్ సీన్స్ పై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:‘సామజవరగమన’.. ప్రీమియర్ టాక్ ఇదే!

- Advertisement -