5వేల మందితో కాళేశ్వరంకు కడియం శ్రీహరి…

675
kadiyam srihari
- Advertisement -

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో5వేల మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. మడికొండ వద్ద వాహనాల జెండా ఊపి టూర్‌ని ప్రారంభించారు కడియం. ఈ సందర్భంగా మాట్లాడిన కడియం…అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ…ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నిరందించారో చెప్పాలని డిమండ్ చేశారు.

పదవులకోసం కృష్ణా, గోదావరి నదుల హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణను ఎండ పెట్టారు.కాంగ్రెస్ నేతలు జలయజ్ఞాన్ని… ధన యజ్ఞంగా మార్చారు.కాళేశ్వరం ప్రాజెక్టు తో సీఎం కేసీఆర్ తెలంగాణ ను సస్యశ్యామలం చేస్తున్నారని చెప్పారు.కాంగ్రెస్ నేతల్లాగే సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతారనుకుంటే పొరపాటేనన్నారు.

కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడొద్దని సూచించారు.పార్లమెంట్ ఎన్నికల్లో 4ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఉలిక్కిపడుతుంది.గ్రామాల్లో బీజేపీ ఎక్కడుందో నేతలు ఆలోచించాలన్నారు.బీజేపీ తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని…తెలంగాణ కు బీజేపీ ఒరగబెట్టింది ఏంది..? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ… కాంగ్రెస్ పార్టీ అంపశయ్య పై ఉంది.

కాంగ్రెస్ పార్టీ…ముసలిది అయిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇప్పుడే ఇప్పుడే అడుగులు వేస్తూంటే టీఆర్ఎస్ నూనూగు మిసలతో యవ్వనంలో ఉంది..టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొని సత్తా మరో పార్టీకి లేదన్నారు.సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ని చూసి ప్రతి ప్రక్షాల మాటలను పార్టీ నేతలు తిప్పికొట్టాలన్నారు.

- Advertisement -