బిచ్చగాడు మూవీతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని. రొటీన్ కథలకు భిన్నంగా ప్రయోగాత్మక కథలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు మూవీ తరువాత భేతాళుడు, యమన్,ఇంద్రసేన వంటి చిత్రాలలో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. తాజాగా కాశిగా మరోసారి ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు విజయ్. ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు పెంచిన విజయ్ తాజగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు.
ఒక పాముతో ట్రైలర్‌ను స్టార్ట్ చేయడం..థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ మేళవింపుతో నాలుగైదు గెటప్పుల్లో విజయ్ ఆంటోనీ ఆకట్టుకున్నాడు. అమ్మా.. నీకో విషయం చెప్పనా? నాకెప్పుడూ ఓ కల వస్తుందని చెప్తాను కదా.. ఓ చిన్నపిల్లాడిని ఎద్దు పొడిచినట్టు, పెద్ద పాము వచ్చినట్టు.. నా గత జీవితంతో ఏదో జరిగి ఉంటుందనిపిస్తుంది.ఒక్కసారి ఇండియాకి వెళ్లి.. నా చిన్నప్పుడు ఏం అయిందో.. నన్ను కన్నవారు ఎందుకు వద్దనుకున్నారో.. తెలుసుకుని వస్తానమ్మా..ప్రారంభమైన కాశి ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.