కేఏ పాల్‌కు ఊహించని షాక్‌..!

336
ka paul
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ప్రధానపార్టీల అభ్యర్థులు.ఇక ఏపీలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా నరసాపురం నుండి టీడీపీ తరపున రాయపాటి సాంబశివరావు,వైసీపీ నుండి రఘురామకృష్ణంరాజు,జనసేన నుండి నాగబాబు,ప్రజాశాంతి పార్టీ తరపున క్రైస్తవ మతప్రభోదకుడు కేఏ పాల్ పోటీచేస్తున్నారు.

ఇక శుక్రవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు కేఏ పాల్,రఘురామ కృష్ణంరాజు. ఈ నేపథ్యంలో కేఏపాల్ నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో తన నామినేషన్‌ తిరస్కరణకు గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని కేఏపాల్ మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

కేఏ పాల్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోని మాట్లాడారు వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు. వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు కేఏ పాల్ ను పరిచయం చేసుకున్నారు. దానికి కేఏ పాల్ మై డియర్ బ్రదర్ నాకు తెలుసు. నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చాడు అని అక్కడున్న రిపోర్టర్లతో అన్నాడు పాల్. అతడు మీపై పోటీచేస్తున్నారు తెలుసా అని అడిగితే ఎంపీ అభ్యర్థా నాకు తెలియదే అంటూ కేఏపాల్ సమాధానం ఇచ్చారు. దీంతో నవ్వుకోవడం అక్కడ ఉన్నవారి వంతైంది. అయితే వెంటనే తెరుకున్న పాల్ రఘురామకృష్ణంరాజు ఓటు, ఆయన తల్లీ, చెల్లి, భార్య అందరి ఓటు నాకే పడుతుందని అన్నాడు. దానికి రిప్లై ఇచ్చిన రఘురామకృష్ణంరాజు గెలుపుపై ఎవరి ధీమా వారిది అని సింపుల్ గా ముగించేశారు. మొత్తంగా ప్రత్యర్థి ఎవరో తెలియకుండా తన బ్లెస్సింగ్స్ కోసం వచ్చాడని చెప్పి కేఏపాల్ పప్పులో కాలేసి నాలుక కరుచుకున్నారు.

- Advertisement -