KA Paul: చంపుతామని బెదిరిస్తున్నారు..కేఏపాల్ ఫైర్

11
- Advertisement -

తనను చంపుతామని కొంతమంది బెదిరిస్తున్నారని మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై తాను కేసులు వేశానని…వాటిని విత్‌ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

గతంలో కూడా తనకు బెదిరింపులు వచ్చాయని….తానెప్పుడూ భయపడనని చెప్పారు. తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానని… ఇకపై తనకు దేవుడే రక్ష అని తెలిపారు. తనపై కుట్ర పన్నిన వారు కలలో కూడా బాగుపడరని అన్నారు.

బాబు రావాలి.. జాబు రావాలి అన్నప్పుడే బాబు వస్తే ఏదీ జరగదని తాను చెప్పానని గుర్తు చేశారు. తిరుమలలో లడ్డూ కల్తీనే జరగలేదని తేలిన తర్వాత.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు. తనను తాను తగ్గించుకున్న వాడు ధన్యుడు అని పవన్‌ కల్యాణ్‌ అంటారని.. కానీ ఏ విషయంలోనూ తాను తగ్గడని ఎద్దేవా చేశారు.

Also Read:కక్ష సాధింపులకు వెళ్లకండి: చంద్రబాబు

- Advertisement -