క్రైస్తవ మత ప్రబోధకుడు,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నర్సాపురం ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన కేఏ పాల్ ప్రచారంలో దూకుడు పెంచారు. సాధారణంగా తన స్పీచుల్లో కాంట్రవర్సీతో అందరి అటెన్షన్ తన వైపుకు తిప్పుకునే పాల్ మరోసారి అలాంటి చమత్కారమే చేశారు.
ఈ సారి కారులో ప్రయాణిస్తూ కిక్ బాక్సింగ్ చేస్తూ వింత చేష్టలతో ఆకట్టుకున్నారు. కారులో వెళుతూ గాల్లో పంచ్ లు విసిరిన పాల్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. కారులో వెళ్తున్న పాల్‌ను చూసిన కొంతమంది వాహనదారులు ఆయనను పలకరించారు. ముందు సీటులో కూర్చున్న పాల్ వాహనదారులు తనను పలకరించగానే ఎక్కడలేని ఉత్సాహంతో గాల్లోకి పిడిగుద్దులు విసరడం మొదలుపెట్టారు. ఆపకుండా పంచ్‌లు విసురుతూ నానా హంగామా చేశారు.
Now I am convinced that he is the guy who taught boxing to the world heavy weight champion Evander Holyfield who beat the shit out of Mike Tyson pic.twitter.com/6gpN9wt59l
— Ram Gopal Varma (@RGVzoomin) March 22, 2019
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, జగన్, పవన్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు పాల్. ఇటీవలె పవన్‌ను విమర్శిస్తూ స్టేజిపైనే స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. డ్యాన్స్, ఫైటింగ్ స్కిల్స్‌తో పాల్ బాగానే ఆకట్టుకుంటున్నారంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరికొంతమంది పాల్ ఊర మాస్ అంటూ పోస్ట్ చేస్తున్నారు.
KA Paul Mass Oora Mass
Must Watch … pic.twitter.com/JALxFcI1aQ— #SSMB28 (@chenna_prince) March 20, 2019