పవన్ కి పాల్.. బంపర్ ఆఫర్!

33
- Advertisement -

ఎలక్షన్ టైమ్ లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో హడావిడి చేసిన పాల్.. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈసారి ప్రజాశాంతి పార్టీదే విజయం అంటూ హడావిడి చేస్తున్నారు. ఇకపోతే ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించే కే‌ఏ పాల్.. తాజాగా జనసేన అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ ప్రజాశాంతి పార్టీతో కలిస్తే 48 సీట్లు కేటాయిస్తామని, అలాగే పవన్ ను సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో పాల్ బంపర్ ఆఫర్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఏ మాత్రం ప్రభావం లేని ప్రజాశాంతి పార్టీ పొత్తులపై క్లారిటీతో ఉండగా.. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ఆరాటపడుతున్న టీడీపీ జనసేనలో మాత్రం స్పష్టత లోపించిందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నట్లు ప్రకటించినప్పటికి ఇంతవరకు ఇతర విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. టీడీపీ జనసేన మధ్య సీట్ల కేటాయింపుపై ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. అలాగే సి‌ఎం అభ్యర్థిపై కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో క్లారిటీతో ఉన్న ప్రజాశాంతి పార్టీతో పవన్ చేతులు కలపాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా జనసేన ఏ మాత్రం ప్రభావం చూపలేదు. 2019 ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒక్కసీటు మాత్రమే దక్కగా.. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కసీటు కూడా దక్కలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీతో పోల్చుతున్నారు కొందరు. మరి 2024 ఎన్నికల్లో ఈసారైనా జనసేన సత్తా చాటుతుందేమో చూడాలి.

https://x.com/sweety_00099/status/1739246149566177618?s=20

- Advertisement -