కేఏ పాల్ బయోపిక్‌..హీరో ఎవరో తెలుసా..!

517
K-A-Paul
- Advertisement -

కేఏ పాల్..తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. మత ప్రబోధకుడిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా తనదైన శైలీలో ఆకట్టుకున్నారు. ఎన్నికల వేళ పాల్ చేసిన ఫీట్లు అన్ని ఇన్ని కాదు. ప్రజాశాంతి పార్టీదే అధికారం… అన్ని పార్టీలను ఓడిస్తానని శపథం చేసిన పాల్ ఎన్నికల తర్వాత కనిపించనేలేదు. అంతేగాదు తాను పోటీ చేసిన స్ధానంలో ఓడిపోయి తీవ్ర నిరాశపర్చారు.

ఎన్నికల వేళ పాల్ చేసిన ఫీట్లకు ఆకర్షితులైన సినీ నిర్మాతలు ఆయన బయోపిక్ తీసేందుకు క్యూ కడుతున్నారు. ఇందుకోసం ఓ కొత్త దర్శకుడు కథను రెడీ చేస్తుండగా ఇందులో పాల్ పాత్రలో ప్రముఖ హాస్య నటుడు సునీల్ నటించనున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

క్రైస్తవ మత ప్రభోదకుడిగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు పాల్. పలు దేశాధినేతలతో స్వయంగా మాట్లాడగలిగే గుర్తింపు తెచ్చుకున్న పాల్ తర్వాత కనుమరుగై పోయారు. 2014,2019 ఎన్నికల్లో దర్శనమిచ్చిన పాల్ సత్తాచాటలేకపోయారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ బయోపిక్ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -