మరో సద్దాం హుస్సేన్‌లా రేవంత్ రెడ్డి: కేఏ పాల్

1
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్. 422 బిల్డింగ్ లు అక్రమంగా కూల్చివేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పాల్…ఆయన తమ్ముడి బిల్డింగ్ ఎందుకు కూల్చలేదు చెప్పాలన్నారు.

తెలంగాణలో రేవంత్ ట్యాక్స్ వసూలవుతోంది…కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అన్నారు. నా మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారు…రేవంత్ నన్ను వాడుకొని వదిలేశాడు అన్నారు. పదవులు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అన్నారు.

గ్రామ పాలన కోసం నా పర్యటనలు…మే 10 లోపు 100 గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాను అన్నారు. మరో రెండేళ్లలో జామిలి ఎన్నికలు ఖాయం అన్నారు పాల్.

Also Read:సారీ చెప్పిన సీవీ ఆనంద్

- Advertisement -