కిరణ్‌కు పెద్ద అభిమానిని: నాగచైతన్య

5
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా ఈ రోజు “క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ – ఈ రోజు “క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. మా మూవీకి టీమ్ అంతా ఏడాదిన్నర కష్టపడ్డాం. ఈ నెల 31న ఒక బ్యాంగ్ లాంటి మూవీతో మీ ముందుకు వస్తున్నాం. “క” సినిమా థియేటర్స్ లో మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. అన్నారు.

డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ – “క” సినిమాకు హోల్ అండ్ సోల్ క్రెడిట్ కిరణ్ అబ్బవరం గారికే ఇవ్వాలి. మా డైరెక్టర్స్ ప్రతి సీన్ ను స్టోరీ బోర్డ్ తో సహా పక్కాగా తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా మూవీని థియేటర్స్ లో తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడక్షన్ హెడ్ మణి మాట్లాడుతూ – “క” సినిమా చాలా బాగా వచ్చింది. ఈసారి మా అన్న కిరణ్ సక్సెస్ కొట్టబోతున్నాడు. మీరంతా థియేటర్స్ కు వెళ్లి ఈ సినిమా చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చవాన్ మాట్లాడుతూ – మా మూవీ ఇంత బాగా రావడానికి టీమ్ అంతా పెట్టిన ఎఫర్ట్స్ కారణం. క ప్రొడక్షన్స్, శ్రీచక్రాస్ ఎంటర్ టైమ్ మెంట్స్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. మా కిరణ్ గారు ఎప్పుడూ మాకు వెన్నంటే ఉన్నారు. “క” సినిమాలో వావ్ ఫ్యాక్టర్స్ , హై మూవ్ మెంట్స్ చాలా ఉంటాయి. సినిమా చివరి 8 నిమిషాలు మిస్ కావొద్దు. అన్నారు.

సీయీవో రహస్య గోరక్ మాట్లాడుతూ – ఈ రోజు “క” ప్రీ రిలీజ్ కు వచ్చిన నాగ చైతన్య గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. కిరణ్ తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి హైస్ అండ్ లోస్ చూస్తూ వస్తున్నారు. తనకు సక్సెస్ రావాలని మీరంతా కోరుకున్నారు. సపోర్ట్ గా నిలిచారు. గోపాలకృష్ణ రెడ్డి గారు మాకెంతో తోడ్పాటు అందించారు. మీ విశెస్ అన్నీ మాకు రీచ్ అవుతున్నాయి. అందుకే “క” లాంటి సినిమా చేయగలిగాం. ఇది మా అందరికీ డ్రీమ్ ప్రాజెక్ట్. మీ బ్లెస్సింగ్స్ తో మా మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Also Read:Harishrao: రేవంత్ సీఎం కాదు..జోకర్

కో ప్రొడ్యూసర్ చింతా వినీషా రెడ్డి మాట్లాడుతూ – “క” సినిమా ఈవెంట్ కు వచ్చిన వారందిరికీ థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్ మీకు నచ్చినట్లే సినిమా కూడా నచ్చుతుంది. మా మూవీ టీమ్ అంతా ఎంతో హర్డ్ వర్క్ చేసి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా మీ సపోర్ట్ దక్కుతుందని కోరుకుంటున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ చింతా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ – “క” మూవీకి మెయిన్ పర్సన్ మా కిరణ్ అన్న. అలాగే మా హీరోయిన్స్ తన్వీరామ్, నయన్ సారిక మెచ్యూర్డ్ పర్ ఫార్మెన్స్ చేశారు. సినిమాను ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా మా డైరెక్టర్స్ రూపొందించారు. “క” సినిమా మా సంస్థకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – మా “క” మూవీ ఈవెంట్ కు నాగ చైతన్య లాంటి మంచి మనసున్న హీరో రావడం సంతోషంగా ఉంది. కిరణ్ గారి మీద నాకు నమ్మకం ఉండే ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఆయన నాకు ఏ మాటైతే ఫస్ట్ ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్నీ తానై ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు. నాకు రిస్క్ లు చేయడం ఇష్టం. మా హీరోయిన్స్ బాగా నటించారు. డైరెక్టర్స్ సందీప్, సుజీత్ అందరినీ ఆకట్టుకునేలా సినిమా రూపొందించారు. సామ్ సీఎస్ తన మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోశారు. తప్పకుండా మా సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – “క” లాంటి బ్యూటిఫుల్ ఫిలింలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. మీకు నా సత్యభామ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అలాగే సినిమా అంతా యూనిక్ గా ఉంటుంది. ఫుల్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కిరణ్ గారితో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన ఇంతే డెడికేషన్ తో తను అనుకున్న అన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నా. నేను తన్వీ రామ్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. “క” సినిమాకు ప్రతి డిపార్ట్ మెంట్ ఎంతో ప్యాషన్ తో హార్డ్ వర్క్ చేసింది. అన్నారు.

హీరోయిన్ తన్వీరామ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో రాధ అనే క్యారెక్టర్ లో నటించాను. తనొక స్కూల్ టీచర్. నా క్యారెక్టర్ సినిమాలో కీలకంగా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ నచ్చే మూవీ చేసేందుకు ముందుకొచ్చాను. మరో రెండు రోజుల్లో మా సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. తప్పకుండా చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

- Advertisement -