రజినీ చేయాల్సింది.. బాలయ్య చేశాడు

185
K S Ravikumar to direct Balakrishna
- Advertisement -

నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణితో భారీ విజయాన్ని అందుకున్నాడు.మరి తన 101వ సినిమా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు బాలయ్య. అంతే కాదు 102వ సినిమాను కూడా లైన్ లో పెట్టేశారు బాలయ్య… పూరీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్ బీ కే 101 ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు తమిళ దర్శకుడు కే.ఎస్. రవి కుమార్ డైరెక్షన్ బాలకృష్ణ 102వ చిత్రం రూపొందనున్న సంగతి ఇప్పటికే ఖాయం అయిపోయింది. ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందిస్తున్నారు. జూన్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రారంభించి జూలై 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది.నటసింహ బాలకృష్ణతోపాటు భారీ తారాగణం నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

K S Ravikumar to direct Balakrishna

మరి ఈ సినిమాపై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్టును సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేసేశారు బాలయ్య. కథ ఆస్థాయిలో ఉండబట్టే.. ఇలా ఒక్క సిట్టింగ్ లోనే ఓకే అయింది. నిజానికి కేఎస్ రవికుమార్ ఈ కథను రజినీకాంత్ కోసం రాసుకున్నాడట. రజినీ-రవికుమార్ కాంబినేషన్ లో నరసింహ.. ముత్తు వంటి సెన్సేషనల్ మూవీస్ వచ్చాయి. కానీ చివరగా వచ్చిన లింగ మాత్రం నిరుత్సాహపరిచింది. అయినా సరే రజినీకాంత్ కోసం ఓ మాంచి కథ చేశాడు ఈ దర్శకుడు.

అయితే సూపర్ స్టార్ మాత్రం రోబో2, కబాలి2 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరింత సమయం పట్టనుండడంతో.. కథకు సరిపోయే హీరోను వెతుక్కున్న కేఎస్ రవికుమార్.. బాలయ్య అయితే సరిగ్గా సరిపోతారని ఫిక్స్ అయ్యాడట. అలా రజినీకాంత్ చేయాల్సిన కథ బాలయ్య చెంతకు చేరుకుంది.

- Advertisement -