తెలంగాణలో నిధుల సమస్యే లేదుః ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి

305
econ
- Advertisement -

తెలంగాణలో ఆర్ధిక పరిస్ధితి పటిష్టంగా ఉందన్నారు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు. వచ్చె నెల నుంచి రైతు బంధు చెక్కులను పంపిణి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికవ్యవస్థ దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే పటిష్ఠంగా ఉన్నదని తెలిపారు. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పింఛన్లు, ప్రాజెక్టుల బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నామని, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధుల కొరత లేదని వివరించారు. రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్-జీఎస్డీపీ) వృద్ధిరేటులో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. సొంత రాబడుల వృద్ధిరేటులో, పెట్టుబడి వ్యయంలో దేశంలో నంబర్ వన్‌గా ఉన్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక తాజా పరిస్థితిపై ఆయన మంగళవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అ నుమానాలు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు.

రైతుబంధు పథకం నిధులను ఆన్‌లైన్ ద్వారా రైతులకు చెల్లిస్తామని, వారికి ఇబ్బంది లేకుండా రుణమాఫీని అమలు చేస్తున్నామన్నారు. మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. రైతుబంధు చెల్లింపులో బకాయిలు లేవని, – 52 ల క్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధిపొందారన్నారు. రైతుబంధు కోసం రబీ సీజన్‌లో రూ.5, 200 కోట్లు నిధులను విడుదల చేశామన్నారు. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 23 వ తేదీ తరువాత రైతుబంధు విడుదల చేస్తామనాని, ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని చెల్లింపుల్లో జా ప్యం జరిగిందన్నారు.- రుణమాఫీ కోసం బడ్జెట్‌లో నిధు లు రూ.6,000 కోట్లను కేటాయించామని వాటిని కూడా విడుదల చేస్తామన్నారు.

ఏప్రిల్ నెల లో ఖర్చు తక్కువగా ఉంటుందని ఆయన తెలిపా రు. ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ, ఆసరా పింఛన్లకు ఓట్ ఆన్ అకౌంట్‌లో ఆరు నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి నెల రాష్ట్రానికి 12,000 కోట్ల వరకు నిధులు వస్తాయని వాటిని అన్నింటికీ సర్దుబాటు చేస్తామన్నారు. ఏ శాఖలోనైనా ఆలస్యం జరిగితే అక్కడి అడ్మిన్ సమస్యగానే పరిగణించాలన్నారు. 5 సంవత్సరాల్లో రూ.80 వేల కోట్లు ఇరిగేషన్‌పై ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రతి సంవత్సరం రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కొన్ని బిల్లులు సాంకేతిక కారణాల వల్ల ఆగిపోతున్నాయని, డిపార్ట్‌మెంట్ ప్రాధాన్యతలను బట్టి వాటిని క్లియర్ చేస్తామన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర సొంత ఆదాయం మూడు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో నాలుగు లక్షల ఎకానమీ ఉంటే అది 2019 సంవత్సరానికి 9 లక్షల చేరుకుందన్నారు.

- Advertisement -