నేడు అమోస్ అంత్యక్రియలు….

906
congress
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తొలితరం నేత కేఆర్‌ ఆమోస్‌ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమోస్‌ గురువారం రాత్రి మల్కాజిగిరిలోని తన నివాసంలో కన్నుమూశారు. అమోస్ మృతిపట్ల రాజకీయాలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. ఇక ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ గారి మృతిపై మంత్రి హరీశ్ రావు గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన ఆమోస్‌ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఉద్యోగం కోల్పోయిన తొలి వ్యక్తి ఆమోస్ అన్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారని నాటి ప్రభుత్వం ఆయనను డిస్మిస్ చేసింది. మృదు స్వభావి అయిన ఆమోస్ తాను నమ్మిన విలువల విషయంలో రాజేపడేవారే కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

కేఆర్ ఆమోస్ మృతి పట్ల సంతాపం తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.1969 తెలంగాణ ఉద్యమంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరవలేనిదని అన్నారు .. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆమోస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి ఈటల రాజేందర్.

- Advertisement -