- Advertisement -
తమిళనాడు అన్నాడీఎంకే- బీజేపీ కూటమి సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ఖరారైంది. చెన్నైలో ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశమై సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేసింది. సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం పళనిస్వామి పేరును, డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం పేరును ఖరారు చేసింది.
ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీలతో పొత్తులు, సీట్ల పంపకం తదితర అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి, పార్టీ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం నిర్ణయాలు తీసుకుంటారని ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది.
- Advertisement -