ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఒక ఖాళీ ఏర్పడడంతో.. ఆ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ కుమార్ పేరును ఖరారు చేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నవీన్ పేరును ప్రకటించారు కేసీఆర్. ఈ సందర్భంగా నేడు ఎమ్మెల్సీ స్థానానికి నవీన్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ దాఖలుకు గడువు ఈ రోజు సాయంత్రం ముగియనుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్య అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఈ ఎన్నిక జరుగుతున్నది. ఇక కాంగ్రెస్ నుండి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేకపోవడంతో నవీన్‌కుమార్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.