ఐపీఎల్ ప్రారంభమైన రెండోరోజే ఫ్యాన్స్ కన్నులవిందునిచ్చింది. మొహాలీ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. కింగ్స్ గెలుపులో ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలకపాత్ర పోషించాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో ఢిల్లీ బౌలర్లను ఉచకోత కోశాడు. కేవలం 14 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రాహుల్‌కు తోడు కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో పంజాబ్ 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లను కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో యూసుఫ్ పఠాన్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా తాజాగా రాహుల్ దానిని అధిగమించాడు. ఇప్పటివరకు యువరాజ్ సింగ్, గేల్ 12 బంతుల్లో, ట్రెస్కోథిక్ 13 బంతుల్లో అర్ధ సెంచరీలు చేయగా ఇప్పుడు రాహుల్ 14 బంతుల్లో ఆ ఘనత సాధించాడు.
ఇక మరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. కోల్‌కతా విధించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని నైట్ రైడర్స్ జట్టు 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు ఉండగానే విజయం సాధించింది. దినేశ్ కార్తిక్ 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలువగా, సునీల్ నరేన్ 50, నితిశ్ రాణా 34 పరుగులు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.