గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన కేకే

533
kk
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డా .కె .కేశవ రావు సోమవారం బంజారాహిల్స్ లోని తన నివాసం ముందు మొక్కలు నాటారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కేకే ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇందులో భాగంగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్,కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జై రాం రమేష్,టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు,బీజేడీ రాజ్యసభ పక్ష నేత ప్రసన్నాచార్య లకు కేకే గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించాలని సూచించారు.

యువ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి పూనుకోవడం హర్షించదగ్గ చర్య అని కేకే ఈ సందర్భంగా అభినందించారు.కాలుష్యం పెరిగిపోవడాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారంలో ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.హారిత హారానికి గ్రీన్ ఛాలెంజ్ తోడయితే ఫలితాలు తొందరగా వస్తాయన్నారు.

మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరచడం తనకు స్ఫూర్తి నిచ్చిందన్న కేకే.. ఎంపీ సంతోష్ కుమార్ ఆయన అడుగు జాడల్లో గ్రీన్ ఛాలెంజ్ అనే మహత్తర కార్యక్రమం మొదలు పెట్టడం అభినందనీయమన్నారు.

https://twitter.com/rao_keshava/status/1188766868460294144

- Advertisement -