లండన్‌లో తెలంగాణ విద్యార్థులకు బాసటగా కవితక్క..

202
k kavitha
- Advertisement -

తెలంగాణ వాసులు ఏ దేశంలో ఉన్నా, వారి కష్టాల్లో బాసటగా నిలుస్తామంటూ మరోసారి ‌నిరూపించింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. తాజాగా లండన్ లో కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యార్థులకు బాసటగా నిలిచారు తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు.

నిజామాబాద్ జిల్లా గడ్కోలే గ్రామానికి చెందిన చింతకుంట మహిపాల్ తో పాటు, ఆర్మూర్, కరీంనగర్, వరంగల్ మరియు హైదరాబాద్ కు చెందిన అరుగురు యువకులు లండన్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి లో మాంచెస్టర్ లోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ లో ఎంబీఏలో చేరారు. అయితే కరోనా వైరస్ బ్రిటన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించింది. అయితే స్థానిక పౌరులకు ‌అన్ని రకాల సహాయం అందించిన బ్రిటన్ ప్రభుత్వం విదేశీయులకు మాత్రం మొండి చేయి చూపింది. దీంతో‌ తెలంగాణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వదేశానికి రావాలని అనుకున్నా, విమాన సర్వీసులు రద్దవడంతో విద్యార్థుల కష్టాలు రెట్టింపు అయ్యాయి.

telangana students

అయితే విద్యార్థులు తమను ఆదుకోవాల్సిందిగా ట్విట్టర్ ద్వారా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, విద్యార్థులకు ఆదుకోవాలని నిర్ణయించారు. మాజీ ఎంపీ కవిత ఆదేశాల మేరకు, తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బల్మూరి మాంచెస్టర్ లోని విద్యార్థులతో వెంటనే సంప్రదించారు. వారికి 3 నెలల పాటు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు.

అయితే కరోనాతో ప్రపంచమంతా స్తంభించినా, విద్యార్థుల కష్టాలను చూసి చలించిన కవిత అన్నీ తానై వ్యవహరించి, కేవలం 10 గంటల్లోనే లండన్‌లో ఉన్న విద్యార్థులకు నిత్యావసర సరుకులు అందేలా చేశారు. అంతేకాదు బ్రిటన్‌లో పరిస్థితులు చక్కబడే వరకూ, విద్యార్థులకు అండగా ఉంటామని‌ తెలంగాణ జాగృతి నాయకులు హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ మాజీ ఎంపీ కవితకి మరియు జాగృతి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -