TTD:16 నుండి జ్యేష్ఠాభిషేకం

12
- Advertisement -

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం(అభిధేయక అభిషేకం) జరుగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత  గోవిందరాజస్వామి  ఉత్సవమూర్తులకు ఏడాదికోసారి స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చుతారు.

ఇందులో భాగంగా జూలై 16న కవచాధివాసం, జూలై 17న కవచ ప్రతిష్ఠ, జూలై 18న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

- Advertisement -