ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, తమిళ నటుడి విష్ణు విశాల్‌తో ప్రేమలో పడినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా గుత్తా జ్వాల డేటింగ్ లో ఉందని తెలుస్తుండగా, ఇటీవలి కాలంలో వీరిద్దరి చిత్రాలూ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీరికి సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఈ ఫోటోలతో కోలీవుడ్ విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల డేటింగ్ చేస్తున్నారన్న మాటకు బలం చేకూరినట్లైంది. ఇప్పటివరకూ విష్ణు విశాల్ పద్నాలుగు సినిమాల్లో నటించారు. వీరిద్దరి జోడి బాగుందన్న మాట సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కొత్త సంవత్సరం తొలి రోజునే తన ప్రేమను ప్రపంచానికి చెప్పేసిన జ్వాల.. అన్ని అనుకున్నట్లు సాగితే ఈ ఏడాదిలోనే ఒకటైనా ఆశ్చర్యం లేదంటున్నారు. గుత్తా జ్వాలకు గతంలో బ్మాడింటన్ మాజీ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ తో వివాహమైంది. కొద్ది కాలం తర్వాత వీరిద్దరూ అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే.
My baby
happy new year
@TheVishnuVishal pic.twitter.com/gxSRyVOHVb
— Gutta Jwala (@Guttajwala) December 31, 2019
Happy 2020
pic.twitter.com/1HhAZ57Cl0
— Gutta Jwala (@Guttajwala) December 31, 2019