ముంబైని హోరెత్తించిన బీబర్..

202
justin-bieber-mumbai
justin-bieber-mumbai
- Advertisement -

పాప్ స్టార్ జస్టిన్ బీబ‌ర్ పాట‌ల‌కు ముంబై ఊగిపోయింది. బుధ‌వారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తన సూపర్ హిట్స్ లో పలు పాటలను పాడి ఆహుతులను అలరించాడు బీబర్. మార్క్ మై వర్డ్స్.. వేర్ ఆర్ యు నౌ.. గెట్ యూజ్డ్ టు ఇట్ వంటి సాంగ్స్ తో మొదలుపెట్టిన బైబర్.. ఆ తర్వాత స్పీడ్ పెంచేశాడు. బీబ‌ర్ రాసిన‌ సారీ సాంగ్ ప్రేక్ష‌కుల‌కు కిక్కెక్కించింది. బీబ‌ర్ ఫ్యాన్స్ న‌ల్ల టీష‌ర్ట్‌ల‌తో షోకు హాజ‌ర‌య్యారు. పాప్‌స్టార్ స్వ‌రాల‌కు అమ్మాయిలు భావోద్వేగాల‌కు లోన‌య్యారు. షోకు హాజ‌రైన అభిమానులు వీడియోలు పోస్ట్ చేశారు.

వీ ల‌వ్ యూ బీబ‌ర్‌, మేరీ జాన్ అంటూ ఫ్యాన్స్ అరుపులు చేశారు. 23 ఏళ్ల పాప్ ప్రిన్స్ జ‌స్టిన్ బీబ‌ర్ షో కోసం టికెట్ల‌కు భారీ ధ‌ర‌ను కేటాయించారు. క‌నీస టికెట్ ధ‌ర 5 వేలు కాగా, అత్య‌ధికంగా 75 వేలు ఉంది. సుమారు 45 వేల మంది అభిమానులు ఈ షోను వీక్షించారు. బీబ‌ర్ వ‌ర‌ల్డ్ టూర్‌ను వైట్ ఫాక్స్ ఇండియా నిర్వ‌హించింది. జియో దీనికి స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది.

ఈ షోకు అందాల తార శ్రీదేవి తన కూతురు జాన్వితో కలిసి రాగా.. ఆలియా భట్.. దువ్వాడ జగన్నాధం హీరోయిన్ పూజా హెగ్డే.. మలైకా అరోరాతో పాటు.. సోనాలీ బెంద్రే, అనుమాలిక్, అర్జున్ రాంపాల్, అర్మాన్ మాలిక్, అర్భాజ్ ఖాన్, అలియా భట్, మలైకా అరోరా తదితరులు వచ్చారు. బీబర్ బృందంలో హ్యారీపోటర్ నటి ఎలారికా జాన్సన్, డీజే సార్టెక్, జీడెన్, అలెన్ వాకర్ తదితరులున్నారు.

- Advertisement -