శ్రీవారి సేవలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్..

46
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్. ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ హుండీలో కానుకలు సమర్పించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. చైర్మన్ కరుణాకర్ రెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

Also Read:జైలర్ కి మూడో రోజు నుంచి లాభాలే

- Advertisement -