ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షహీమ్ అఖ్తర్

8
- Advertisement -

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం ఏర్పాటైన ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా జస్టిస్ షహీమ్ అఖ్తర్ గారి కమిషన్‌ వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయాల్సిఉంది.

రెండు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించాలని, 24 గంటల్లోగా కమిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం తెలిసిందే.

Also Read:అల్సర్ ఉందా.. అల్లంతో జాగ్రత్త!

- Advertisement -